
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి
* 2 లక్షల మందికి ఉపాధి
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చేనేత కుటుంబాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో 11 టెక్స్ టైల్ పార్కులు రానుండగా, తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)ని కోరగా ఆయన పెద్ద మనసుతో తెలంగాణకు ఒకటి మంజూరు చేశారని తెలిపారు. వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు రానుందని వివరించారు. శిల్పారామంలో చేనేత వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వీవర్స్ సర్వీసెస్ సెంటర్ ఆధ్వర్యంలో చేనేత వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ చేనేత రంగంలో కార్మికులను ప్రోత్సహించాలని అన్నారు. చేనేత కుటుంబాలకు గౌరవంతో పాటు, ఉత్పత్తులను పెంచేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చేనేత కార్మికులకు పూర్తిస్థాయిలో అండదండలు ఉంటాయన్నారు. తెలంగాణ పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ చీరలకు విశేష ఖ్యాతి ఉందన్నారు. వాటితో పాటు వరంగల్ తివాచీకి జీఐ ట్యాగ్ వచ్చిందన్నారు. తయారుచేసిన కార్మికుడి ఫొటోతో పాటు వీడియో కూడా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. వరంగల్ లో మెగా టెక్సైటైల్ పార్కు వస్తే 2 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందుతారన్నారు. అంతేకాకుండా తెలంగాణలో హ్యాండ్లూమ్ కంపెనీల ఏర్పాటులో కేంద్రం కృషి ఉందన్నారు. రానున్న రోజుల్లో కొత్త టెక్నాలజీకి ప్రోత్సాహం ఉంటుందని, దానికి నిరద్శనమే చింతపిల్లి సుదర్శన్ గొప్పతనాన్ని గుర్తించి పద్మశ్రీని ఇచ్చిన సందర్భాన్ని కిషన్ రెడ్డి (Kishanreddy) గుర్తుచేశారు.
…………………………………………..