ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రూప్ – 2 నియామక పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగనున్న పరీక్షలను డిసెంబర్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. గ్రూప్ – 2లో 783 పోస్టులు ఉండగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ, గ్రూప్ – 2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అబ్యర్ధులు ఆందోళన చేశారు, దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. డిసెంబర్లో నిర్వహించే పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.
——————————————-