* మరో 198 పోస్టులకు నోటిఫికేషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు మరో కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. 198 పోస్టులను ప్రకటించింది. 84 ట్రాఫిక్ ట్రైనీ సూపర్ వైజర్ పోస్టులు, 114 మెకానికల్ సూపర్ వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు నెల వారీ వేతనం 27,080 నుంచి 81,000 వరకు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు www.tgprb.in వెబ్సైట్ను సందర్శించాలని సూచిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ఫారమ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అర్హతలను పరిశీలించుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని, లేని పక్షంలో దరఖాస్తు రుసుం వృథా అవుతుందని సూచిస్తున్నారు.
…………………………………………………..

