
* ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్
* త్రివిధ దళాల మీడియా సమావేశంలో కీలక విషయాలు
* ఉగ్రస్థావరాల ధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు విడుదల
* శాటిలైట్ చిత్రాలతో దాడులను వివరించిన భారత్
ఆకేరు న్యూస్, డెస్క్ :
పాక్ ఆర్మీ, అక్కడి పౌర స్థావరాల జోలికి వెళ్లలేదని, కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేపట్టినట్లు త్రివిధ దళాలు ప్రకటించాయి. దాడుల వివరాలను కల్నల్ సోఫియా ఖురేషీ, విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వోమికా సింగ్ వెల్లడించారు. పాక్ సవాల్ నాలా నుంచి బవాల్పూర్ వరకు క్షిపణి దాడులు దాడులు చేపట్టింది. అక్కడి పౌర స్థావరాలకు నష్టం కలగకుండా దాడులు జరిగాయి. ఎల్ ఓసీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కోట్లీ, 9 కిలోమీటర్ల దూరంలోని బర్నాలపై దాడి చేపట్టాయి. ఎల్ ఎఓసీకి సమీపంలోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులు నిర్వహించింది. సరిహద్దులోకి సమీపంలోని సియాల్ కోట్లోని సర్జల్పై కూడా దాడి చేసింద. మెహమూనా జాయా సియాల్ కోట్ (మెహమూనా జాయా హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణ కేంద్రం)పైనా దాడి జరిగింది. ఉగ్రవాదులు కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలను కూడా భారత్ సైన్యం ధ్వంసం చేసింది. నిర్దిష్ఠ భవనాలు లేదా భవన సముదాయాలే లక్ష్యంగా దాడులు చేశామని, అక్కడి పౌర స్థావరాలకు ఎటువంటి నష్టమూ కలగజేయలేదన్నారు. అలాగే పాక్ సైనిక స్థావరాలను భారత్ లక్ష్యం చేయలేదన్నారు. పహల్గామ్ మృతుల కుటుంబాలకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ అని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన దాడులు సక్సెస్ అయ్యాయని వెల్లడించారు.
…………………………………………………..