* మీర్జాగూడ ప్రమాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి
* మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం
* క్షతగాత్రులకు రూ.2 లక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మీర్జాగూడ బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) అన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పరిహారం అందించడంతో పాటు, అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్టీసీ ఇన్సూరెన్స్ కూడా అందిస్తామన్నారు. బాధితులకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాని స్పష్టం చేశారు. కాగా, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Pomma Prabhakar) అధికారికంగా ధ్రువీకరించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. అక్కడి పరిస్థితులు చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, మృతుల కుటుంబాలకు అండగా తమ ప్రథమ కర్తవ్యం అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై అత్యం ప్రాధాన్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం తరఫున కృషి చేస్తామన్నారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు..
సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన ఘోర ప్రమాదం లో మరణించిన వారికి పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. పోస్టు మార్టంలో తాండూరు, వికారాబాద్, గాంధీ, ఉస్మానియాకు చెందిన వైద్యులు పాల్గొంటున్నారు. కాగా ఇప్పటి వరకు గుర్తించిన మృత దేహాల్లో తాండూరుకు చెందిన నజీర్ అహ్మద్,కర్ణాటక లోని భానూర్ కు చెందిన నాగమణి,గంగారాం తండాకు చెందిన తారిబాయి, మల్లగంతు హన్మంతు,గుర్రాల అనిత,గోగుల గుణమ్మ,షేక్ ఖలీద్ హుసేన్, తబస్సుం జహాన్, డ్రైవర్ దస్తగిరి బాబా , కల్పన, ఏమావత్ తాలీబాయి గా గుర్తించారు. మృత దేహాలను వారి వారి బంధువులకు అప్పగించనున్నారు.
……………………………………..
