
* మహిళా సమాఖ్య సభ్యులకు ఏటా రెండు జతల క్వాలిటీ చీరలు
* మహిళల కోసం శిల్పారామం పక్కనే వ్యాపార సామ్రాజ్యం
* నారాయణపేట జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, నారాయణపేట : నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanthreddy) పర్యటించారు. అప్పక్ పల్లెలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోలు బంకును ఏర్పాటు చేశారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అదానీ, అంబానీలతో పోటీపడి సోలార్ విద్యుత్ లాంటి వ్యాపారాలను పెట్టేలా సర్కారు తోడ్పాటునందిస్తోందన్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను నిర్వహించబోతున్నారని అన్నారు. హైటెక్ సిటీకి ఆనుకుని మూడున్నర ఎకరాల భూమిలో వందలాది దుకాణాలు ఏర్పాటు చేసి, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఆడబిడ్డల కోసం శిల్పారామం (Silpharamam) పక్కనే పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మహిళా సంఘాలకు ఏటా రెండు జతలు క్వాలిటీ ఉన్న చీరలను అందజేస్తామన్నారు. దాదాపు 1000 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కోటి మంది మ హిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు. సమాఖ్యల్లో మొత్తం 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అందరినీ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. కేంద్రం, రాష్ట్రం ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటున్నామో, బడిని కూడా అంతే పవిత్రంగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna), మంత్రులు సీతక్క, పొంగులేటి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
………………………………..