
* భక్తజన సంద్రం.. కాళేశ్వర క్షేత్రం
ఆకేరున్యూస్, కాళేశ్వరం : పుష్కరాలలో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలు పోయి పుణ్యమాచరిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి ఈ సంవత్సరం అంతర్వాహినిగా పూజలనుకుంటున్న సరస్వతీ నదికి కాళేశ్వర క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలను ఏర్పాటు చేసింది. దీంతో నాలుగవ రోజు కాళేశ్వర క్షేత్రం భక్తజన సంద్రంతో కళకళలాడి శివనామ స్మరణతో మర్మ్రోగింది. రోజురోజుకు భక్తుల తాకిడి అధికమవుతుండటంతో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా సౌకర్యాల కల్పనలో ముందుకు సాగుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న భక్తులు పుష్కర ఘాట్లలో పుణ్యస్నాలాచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి నీ దర్శించుకుని పునీతులవుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
…………………………………………