* బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాజ్యాంగ సవరణ చేసి.. బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో అమోదించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలోని హోటల్లో బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ సత్యం అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయ పరమైన చిక్కులున్నాయనే సాకుతో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు.
……………………………………………..
