
* వరంగల్ కలెక్టర్ సత్య శారద
వరంగల్ బ్యూరో (నినాదం న్యూస్): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రెండో దఫా గృహాల నిర్మాణాల కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శనివారం వరంగల్ నగరం, బల్దియా పరిధి 18 డివిజన్ క్రిస్టియన్ కాలనీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు సర్వే తీరును క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. రెండో దఫా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి అర్హులేనా కదా అన్న విషయాన్ని భౌతికంగా పరిశీలించి, డేటా ఆధారం గా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నిర్వహిస్తున్న సర్వే విధానాన్ని కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు సమర్ధంగా నిర్వహించుటకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధల మేరకు అర్హుల గుర్తింపు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతో జరగాలన్నారు. ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇండ్లకు నియమించిన ప్రత్యేక అధికారి అత్యంత జాగ్రతతో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.ఇందిరమ్మ కమిటీలు అందించిన జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే మంజూరు చేసే జాబితా నుంచి తొలగించాలని అధికారులకు సూచించారు. ఈనెల 30 వరకు అర్హతల పరిశీలన ప్రక్రియ పూర్తికావాలన్నారు. భూమి విస్తీర్ణం 60 గజాలకు మించకూడదని, గతంలో బేస్మెంట్, పిల్లర్స్ కట్టిన వారు ఇందిరమ్మ పథకానికి అర్హులుకారనే విషయాన్ని గుర్తించాలనీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నకు ఎంపికైనవారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ప్రొసీడిరగ్స్ అందిన తర్వాతే నూతన ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసుకుని ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, హోసింగ్ ప్రాజెక్ట్ అధికారి గణపతి, కార్పొరేటర్ వస్కుల బాబు, ప్రత్యేక అధికారి రమేష్, రెవెన్యూ అధికారి శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………..