
* పార్కింగ్ విషయంలో గొడవ..
ఆకేరు న్యూస్ డెస్క్ : పార్కింగ్ విషయంలో గొడవ.. చివరికి ఒకరి ప్రాణం తీసింది.. ఈ సంఘటన గురువారం రాత్రి ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ హూమా ఖురేషి సోదరుడు అసిఫ్ ఖరేషీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ సోదరుడు అసిఫ్ జంగ్‌పుర ఏరియాలో నివాసం ఉంటున్నాడు. పొరిగింటి వ్యక్తి గురువారం రాత్రి తన స్కూటర్‌ను అసిఫ్ ఇంటి గేటు ముందు పెట్టాడు. గమనించిన అసిఫ్ గేటు ముందు నుంచి స్కూటర్ తీయాలని అడగంతో వాగ్వివాదం చోటుచేసుకుని, చివరికి తీవ్రమైన గొడవగా మారింది. దీంతో పొరిగింటి వ్యక్తి పదునైన వస్తువుతో అసిఫ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రగాయాలైన అసిఫ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. పొరిగింటి వ్యక్తి పారిపోయాడు. కుటుంబ సభ్యులు అసిఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
………………………………………..