
* కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లో ఘటన
ఆకేరు న్యూస్ ఆసిఫాబాద్ : కొద్ది రోజుల్లో తన వంశానికి ఓ చిరంజీవిని ప్రసాదించే కోడలిని అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ ప్రబుద్దుడు .తొమ్మిది నెలల నిండు గర్భిణి అని చూడకుండా కొడుకు భార్యఅయిన కోడలిని అతి కిరాతకంగా మామ హత్య చేశాడు. ఈ ఘటన కొమురం భీం జిల్లా దహెగాం మండలం గెర్రే గ్రామంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హతురాలి భర్త శేఖర్ హతురాలు రాణి ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. శేఖర్ తండ్రి సత్యనారాయణకు శేఖర్ రాణిల కులాలు వేరు కావడంతో వారు పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదు పెళ్లి వద్దని వారించాడు. ఈ క్రమంలో శేఖర్ కుటుంబంలో వేధింపులు మొదలయ్యాయి శేఖర్ తన భార్య తో కలిసి ఎదురుగా ఉన్న అత్తవారింట్లోనే ఉంటున్నాడు.కాగా శనివారం శేఖర్ అత్తమామలు అడవికి వెళ్లగా శేఖర్ కూడా బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన సత్యనారాయణ ఎదురింట్లోకి ప్రవేశించి కోడలు రాణిని అతి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………….