
* యూపీిఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే యోచన
ఆకేరున్యూస్, ఢిల్లీ: యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు అందరూ అలవాటు పడ్డారు. ప్రజలు నగదు లావాదేవీలను పక్కన పెట్టారు. మోడీ పిలుపుతో అంతా ఆన్‌లైన్‌లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఇలాంటి యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో చేసే లావాదేవీలపై వ్యాపారులపై ఎలాంటి ఛార్జీల భారం లేదు. అయితే, త్వరలోనే ఈ లావాదేవీలపైనా మర్చెంట్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిఎస్టీ తదితర భారాలు తప్పడం లేదు. బ్యాంకు లావాదేవీలపైనా భారం పడుతోంది. రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కథనాలు పేర్కొన్నాయి. వార్షిక ఆదాయం రూ.40లక్షలపైన ఉండే వ్యాపారులకు యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్‌ను తిరిగి తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ ఇండస్టీ ప్రతినిధులు ఇటీవల కేంద్రానికి అధికారిక ప్రతిపాదన పంపారు.
…………………………………..