
* సమ్మక్క ప్రధానపూజారి సిద్ధబోయిన సురేందర్
ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసీ ఆరాధ్య దైవాలు వెలసిన మేడారం జాతర అబివృద్ధి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని సమ్మక్క దేవత ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. మేడారం జాతర అబివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ,మేడారం పరిసార ప్రాంత గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, రోడ్లు అభివృధి చేయాలని కోరారు.మేడారం జాతర సమయం లో రెండవ పంట నష్టం జరుగుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.అంతేకాకుండ, మేడారం లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేయాలని, మేడారం పూజారుల కుటుంబాలకు జాతర ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం కేటాయించాలన్నారు, భక్తులకు శాశ్వత అబివృద్ధి పనులు చేయాలని,
ట్రస్టు బోర్డు కమిటీ 3 నుండి 7 గోత్రం వారికీ చైర్మన్ పదవి కేటాయించాలని అన్నారు .
2026 లో జరిగే జాతరకు కేంద్ర మంత్రులు ప్రధాన మంత్రి సమ్మక్క సారలమ్మ జాతర ను సందర్శించాలని కోరారు.తదితర అంశాలతో కూడిన వినతి పత్రం కేంద్రం మంత్రి కి అందించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్,మల్లెల రాంబాబు, నరేష్, లక్ష్మణ్ , హన్మంతరెడ్డి, సుభాష్, తదితరులు ఉన్నారు.
…………………………………………..