* పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల రేపే
ఆకేరు న్యూస్ డెస్క్ : రైతులకు ప్రధానమంత్రి (Prime Minister) కిసాన్ సమ్మాన్ నిధు(Kisan Samman funds)లను కేంద్రం మంగళవారం విడుదల(Tuesday Release)చేయనుంది. ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల(Farmers) కు ఇస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. 2024-25 ఏడాదికి సంబంధించిన తొలి విడత నిధులను రేపు విడుదల చేయనుంది. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన రోజునే పీఎం కిసాన్ (PM KISAN)పెట్టుబడి సాయంపై మోదీ(Modi) తొలి సంతకం చేశారు. 2018-19 నుంచి ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది కేంద్రం. తొలి విడత నిధులు మే- జూన్ నెల్లో ఇస్తే అక్టోబర్- నవంబర్‌లో రెండో విడత, జనవరి పిబ్రవరిలో మూడో విడత నిధులు ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 16 విడతల్లో ఇప్పటి వరకు రైతులకు సాయం చేశారు. ఇప్పుడు 17 విడతలో నిధులు విడుదల చేస్తున్నారు. పదహారు విడతల్లో మూడు లక్షల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసే మొదటి విడత పీఎం కిసాన్ నిధుల విడదల ద్వారా 870 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/ కి వెళ్లి ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేస్తే నో యువర్ స్టాటస్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీ వివరాలు తెలుసుకోవచ్చు.
——————–