* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాjన్నారు. మెదక్ చర్చిని సందర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చాన హామీలన్నింటికా ఎగనామం పెట్టారన్నారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలు ఆశించారు. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని.. తక్షణమే రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి అనిజజ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు క్రైస్తవులకు పేగుబంధం ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదు అని.. మత సహనానికి నిదర్శనం మెదక్ చర్చి అన్నారు.
……………………………………