* రాజలింగం హత్యకేసులో బీఆర్ ఎస్ నేత అరెస్ట్
* నేడు కోర్టులో హాజరు!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అధికారికంగా చూపించలేదు. గత నెల 19న రాజలింగమూర్తి హత్య జరిగింది. ఈ కేసులో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ ఎస్ నేత కొత్త హరిబాబు (Kotha Haribabu)ఏ8గా ఉన్నారు. తన భర్త హత్యకు హరిబాబే ప్లాన్ వేశాడని రాజలింగమూర్తి భార్య సరళ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన నాటి నుంచీ హరిబాబు పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఢిల్లీ(Delhi)లో ఉన్న హరిబాబును రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. హరిబాబుతో పాటు మంగపేటకు చెందిన దంపతులను కూడా అరెస్ట్ చేశారు. హరిబాబు ముందస్తు బెయిలు పిటిషన్పై కోర్టులో వాదనలు ఉండడంతో అరెస్ట్ చూపించడంలేదని తెలుస్తోంది. నేడు జిల్లా కేంద్రంలో అరెస్ట్ చూపించి, కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. హత్య అనంతరం హరిబాబు.. ఇద్దరు సహాయకులతో కలిసి పలు ప్రాంతాలు మార్చి పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్నారు. అయితే, స్నేహితుడి క్రిడిట్ కార్డు (Creditcard)వినియోగించడం ద్వారా హరిబాబు ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
………………………
