
*అమెరికా జైలులో నెల్లుట్ల వాసి ఆత్మహత్య
*స్నాప్‌చాట్‌లో బాలుడిలా నమ్మిస్తూ బాలికలతో చాటింగ్
*నగ్న వీడియోలు తీసి పంపేలా ఒత్తిడి, బెదిరింపులు
*ఈ ఏడాది ఏప్రిల్‌లో 420 ఏళ్లు జైలుశిక్ష వేసిన అమెరికా కోర్టు
*జూలై 26న ఆత్మహత్యచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి..
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆమెరికాలోని జైలులో నెల్లుట్ల వాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా లింగాలఘణపురం (LINGALA GHANAPURAM)మండలంలోని నెల్లుట్లకు చెందిన కుర్రెముల ఉప్పలయ్య – శోభ దంపతుల కుమారుడు కుర్రెముల సాయికుమార్ (KURREMULA SAI KUMAR) (31) పదేళ్లుగా అమరికాలోని ఒక్లహామాలోని ఎడ్మండ్ లో ఉంటున్నాడు. ఇతడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న బంధువుల అమ్మాయిని రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే ఉంటున్నాడు. కాగా, సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్‘ ద్వారా బాలికలతో పరిచయం పెంచుకుని, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడారని, ఆ బాలికల అశ్లీల వీడియోల (చైల్డ్ పోర్నోగ్రఫీ)ను ఇతరులకు పంపారని ఆయనపై కేసునమోదైంది. ఖాతా ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ ఆధారంగా అమెరికా దర్యాప్తు అధికారులు సాయికుమార్ ను అరెస్టు చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో.. స్నాప్‌చాట్‌లో తాను 13- 15 ఏళ్ల బాలుడని నమ్మిస్తూ 18 మంది అమెరికా బాలికలతో చాటించ్ చేసి, మభ్యపెట్టి.. వారి నుంచి నగ్న, అశ్లీల వీడియోలు సేకరించారని గుర్తించారు. నిరాకరించిన బాలికలను, వారి కుటుంబసభ్యులను చంపేస్తామని, అశ్లీల ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడని కోర్టులో చార్జిషీట్ వేశారు. విచారణలో ముగ్గురు బాలికలతో నేరపూరితంగా ప్రవర్తించినట్టుగా అంగీకరించి, తనకు తక్కువ శిక్ష వేయాలని సాయికుమార్ న్యాయమూర్తిని అభ్యర్థించాడు. బాలికలపై వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీని అత్యంత తీవ్రమైన నేరం గా పరిగణిస్తూ.. సాయికుమార్‌కు న్యాయమూర్తి చార్లెస్ గుడ్విన్ 420 నెలలు ( 35 ఏళ్ల ) జైలుశిక్ష విధిస్తూ మార్చి 27 2025న తీర్పు ఇచ్చారు. దీంతో మానసిక వేదనకు గురైన సాయికుమార్ జూలై 26న జైలులో ఉరివేసుకున్నాడు. మృతదేహాన్ని అప్పగించేందుకు అమెరికా అధికారులు నిరాకరించడంతో.. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు.
…………………………………