
* కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, న్యూ ఢిల్లీ : తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు (SUPREME COURT) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కడ జరిగిన పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ (CS)తో పాటు కార్యదర్శులు జైలుకు వెళ్లాల్సిందే అని హెచ్చరించింది. అక్కడ చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చెట్ల తొలగింపు పనులు చేపట్టారని మరోసారి ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. ఈ సందర్భంగా విజిల్ బోయర్స్, విద్యార్థులపై కేసుల విషయాన్ని ప్రస్తావించిన న్యాయవాదులు కోర్టు ఎదుట ప్రస్తావించారు. కేసులు కొట్టివేయాలని అప్లికేషన్ దాఖలు చేశామన్న న్యాయవాదులు తెలిపారు. అయితే, ఈ పిటిషన్‌తో కలిసి విచారించడం కుదరదని.. కేసులు కొట్టివేయాలన్న అప్లికేషన్స్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అవసరమైతే మరో పిటిషన్ వేయాలని కోర్టు సూచించింది. ఈ కేసు విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది.
…………………………………………….