
* లఖ్ నవ్లో బ్రహ్మోస్ క్షిపణి యూనిట్ ప్రారంభం
* అందుకే అక్కడకు రాలేకపోయా : రాజ్ నాథ్ సింగ్
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేస్తూ కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. రూ.300 కోట్ల వ్యయంతో ఉత్తరప్రదేశ్ ((Uttarpradesh) లోని లఖ్ నవ్ లో బ్రహ్మోస్ క్షిపణి యూనిట్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా ఈ యూనిట్ ను వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. లక్నోలోని ‘ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఈసందర్భంగా రాజ్ నాథ్ (Rajnath Singh) మాట్లాడుతూ.. పరిస్థితుల దృష్ట్యా బ్రహ్మోస్ క్షిపణ యూనిట్ ప్రారంభోత్సవానికి నేరుగా రాలేకపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా తాను ఢిల్లీ ఉండడం అత్యవసమని పేర్కొన్నారు.
బ్రహ్మోస్ శక్తి తెలియాలంటే పాక్ ను అడగండి
ఆపరేషన్ సిందూర్ వేళ.. బ్రహ్మోస్ శక్తిని అందరూ చూసే ఉంటారని యూపీ సీఎం యోగి తెలిపారు. బ్రహ్మోస్ శక్తి గురించి తెలియకపోతే, పాక్ ప్రజలను అడగండి అన్నారు. ఏ ఉగ్రదాడినైనా దేశంపై యుద్ధంగానే భావిస్తామని ఇప్పటికే ప్రధాని ప్రకటించినట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకూ సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి భారత్ దేశం గొప్ప సందేశాన్ని ఇచ్చిందన్నారు.
ఇదీ దీని ప్రత్యేకత
ఏడాదికి 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను డిజైన్ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్, రష్యాల సంయుక్త వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్‌తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్ క్షిపణి బరువు 1290 కిలోలు.
………………………………………………