జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువు లోపు శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ , ఆర్డీవో వెంకటేష్ తో కలసి సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ విఐపి, వివిఐపి పార్కింగ్ స్థలాలను రహదారులను , గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులు , రెడ్డిగూడెం అంతర్గత రహదారులను వాటి పనుల పురోగతిని ఆర్డీవో వెంకటేష్ ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్ వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పాటు స్థానిక తహసిల్దార్ సురేష్ బాబు రెవెన్యూ అధికారులు తదితరులున్నారు.
………………………………
