
* సింగూరు ప్రాజెక్టు సమీపంలో ఘటన
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టు సమీపంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఈ ఘటనకు పాల్పడ్డారు. నారాయణఖేడ్ (NARAYANKHED) పరిధి నిజాంపేట వాసులైన ఉదయ్ కుమార్ (21), మౌనిక (19) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే వారి ప్రేమకు, పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కలిసి ఉండలేక.., కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. మునిపల్లి మండలం బుసారెడ్డి పల్లి హరిత రెస్టారెంట్(HARITHA RESTAURENT) లో నిన్న మధ్యాహ్నం ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం రెస్టారెంట్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య (SUICIDE)చేసుకున్నారు. ఎంతకూ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా ఇద్దరూ ఉరేసుకుని చనిపోయి కనిపించారు.
………………………………………..