
* 27న పోలింగ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ (Warangal-Khamam-Nalgonda)ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ (Karimnagar-medak-nizamabad-adilabad)పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఆయా పార్టీల కీలక నేతలు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యే నెకొంది. కరీంనగర్ (karimnagar)గ్రాడ్యుయేట్ నియోజవకర్గంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 25,921 మంది ఓట్లర్లు ఉన్నారు. నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉన్నారు. బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నా… ఐదారుగురు ప్రధాన అభ్యర్థుల మధ్యే పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
………………………………….