
* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణను కాపాడటమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, పార్టీ కార్యకర్తలకు వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, ఏ చిన్న అవసరమున్నా తనను కార్యకర్తలు సంప్రదించవచ్చన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు తేలేదని.. ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. మన కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపోని హామీ ఇచ్చి అధికారంలోక వచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దే అని కవిత అన్నారు.
……………………………………….