
* నవ వధువు ఆత్మహత్య
* ఉదయం ఆనందోత్సవాలు.. రాత్రి ఆర్తనాదాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉదయం వివాహ వేడుకలతో ఆనందోత్సవాలు .. రాత్రి నవ వధువు ఆత్మహత్యతో ఆర్తనాదాలు.. ఉదయం వివాహం చేసుకున్న ఓ నవ వధువు రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి (Sri satyasai) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి (Somandepally) మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి (Krishnamurthy) -వరలక్ష్మి (Varalakshimi) దంపతులకు హర్షిత (Harshitha) (22) అనే కూతురు ఉంది. హర్షిత వివాహం కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి ప్రాంతం దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్ర (Nagendra) తో సోమవారం ఉదయం జరిపారు. సోమందేపల్లిలో తొలిరాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తన గదిలోకి వెళ్లిన వధువు బయటకు రాకపోవడంతో తలుపు తట్టినా గదిలో నుంచి ఏలాంటి సమాధానం రాకపోవడంతో తలుపులను బలవంతంగా తెరిచారు. హర్షిత గదిపైకప్పుకు వేలాడుతూ కనిపించడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హర్షిత మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. హర్షిత ఆత్మహత్య ఎందుకు చేసుకుందో వివరాలు తెలియలేదు.
…………………………………………