* రైలు, విమాన రాకపోకలకు ఆటంకం
* జీరో విజిబిలిటీతో సమీపంలోని దృశ్యాలూ కనిపించని వైనం
ఆకేరున్యూస్ డెస్క్ : ఢిల్లీ సహా ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. కొన్ని ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ వల్ల సమీపంలోని దృశ్యాలు కూడా కనిపించడం లేదు. పొగమంచు కారణంగా రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉత్తరాధిన పలు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో గరిష్ఠం 16, కనిష్టం.. 7.6 గా నమోదైంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోయింది. మరికొన్ని రోజులు చలితీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. ఈ నెల 8 వరకు ఢిల్లీలో పొగమంచు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపిన వాతావరణ శాఖ.. ఆరెంజ్ అలర్ట్ (Orange Allert)జారీ చేసింది. అలాగే, బిహార్(Bihar), పంజాబ్(Panjab), రాజస్థాన్(Rajasthan), హరియాణ(Hariyana)ల్లోనూ0 దట్టమైన పొగమంచు కమ్మేసింది. రాజస్థాన్లో ఫతేపూర్ కనిష్ట ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలకు పడిపోయింది. చలిగాలుల దృష్ట్యా నోయిడాలో 8వ తరగతి వరకు సెలవులు ప్రకటించారు.
……………………………………….