
బీజేపీ ఎంపీ బండి సంజయ్
* కాంగ్రెస్ హయాంలో కాలేజీలు నడిచే పరిస్థితి కరువు
* కేంద్ర మంత్రి బండి సంజయ్
ఆకేరు న్యూస్, మంచిర్యాల | ఫీజు రీయింబర్స్ మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అని కాంగ్రెస్ (CONGRESS) చెప్పుకుంటోందని, బకాయిలు చెల్లించని కారణంగా ఈరోజు కాలేజీలు నడిచే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay ) అన్నారు. మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాలేజీ యాజమాన్యాలకు వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎక్కువగా పెంచారని ఉద్ఘాటించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సేవా భారతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. ప్రతి ఏడాది మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇస్తోందని నొక్కిచెప్పారు. ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోందని గుర్తుచేశారు బండి సంజయ్. మోదీ (MODI) ప్రభుత్వంలో ఎక్కడా పేపర్ లీక్ కాలేదని… ఎక్కడా ఉద్యోగాలు అమ్ముకోలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ను గెలిపిస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. కానీ ఫలితం లేదని విమర్శించారు.
……………………………………….