* రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమైతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో వున్న గిరిజన గురుకుల పాఠశాల, ఇంటర్ కళాశాల హాస్టల్లో మంత్రి సీతక్క బుధవారం బస చేశారు. హాస్టల్ కి విచ్చేసిన మంత్రి సీతక్కకు విద్యార్థినులు సాథర స్వాగతం పలికారు. విద్యార్థినులతో కలిసి మంత్రి కదం కలపడంతో విద్యార్థులు రెట్టింపు జోష్ తో మంత్రితో కలిసి ఆడిపాడారు.
అలాగే విద్యార్థులతో కలిసి యోగా చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతోందని, అయితే విద్య అంటే కేవలం పుస్తకాలతో కుస్తీ మాత్రమే కాదన్నారు. సంపూర్ణ విద్యతోనే చిన్నారుల సర్వతోముఖాభివృద్ది సాధ్యపడుతోంది. అందుకే విద్యార్థుల్లో విజ్ఞాన, మేధో, మానసిక, శారీరక, భావోద్వేగ సామర్థ్యాన్ని పెంపొందించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. అంతకు ముందు మంత్రి హాస్టల్లోని గదులను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులపై స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
………………………………………..