
* సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల
ఆకేరున్యూస్, హన్మకొండ: హనుమకొండ కేంద్రంగా మూడు సంవత్సరాల క్రితం నెలకొల్పబడిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ 22వ చిత్రకళా పోటీలను ఈరోజు హన్మకొండలో గల తనిష్క్ షోరూంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కళల్ని ప్రోత్సహించే పోటీల్లో పాల్గొని వేసవి సెలవులను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని, మాతృ భాషను మర్చిపోవద్దని, సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని.. పిల్లలను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలను ఒంటి చేత్తో నడిపిస్తున్న సంస్థ డైరెక్టర్ సాగంటి మంజులకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని అభినందించారు. అనంతరం మంజుల మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న కళల్ని గుర్తించి, ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు మంచి స్థాయికి ఎదుగుతారని తల్లిదండ్రులకు సూచిస్తూ పిల్లల్లో దాగి ఉన్న చిత్రకళని వెలికితీయడమే తన సంస్థ లక్ష్యమన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా మాతృదేవోభవ అనే అంశంపైన 4 విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులను, పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బన్న ఐలయ్యతో పాటు తనిష్క్ షో రూమ్ మేనేజర్ హరినాథ్, ప్రముఖ కార్టూనిస్ట్ చంద్ర, పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
………………………………………………