* మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి.
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళ అభ్యున్నతికి కృషి చేస్తున్నదని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి అన్నారు.ములుగు జిల్లాలోని ఇంచర్ల గ్రామంలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ తో కలసి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర మహిళల కోసం అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ములుగు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) గతంలో ఏప్పుడు లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని మహిళల కోసం వారి అబివృద్ధి కోసం పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచర్ల PACS చైర్మన్ చిక్కుల రాములు, PACS మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముసినేపల్లి కుమార్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి శానబోయిన అశోక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి,నాయకులు మోరే రాజ మొగిలి,రాజు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళకు పాల్గొన్నారు.
……………………………………………………………
