* అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : ప్రభుత్వం ప్రతి గింజ ధాన్యం కొంటుందని అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం గూడూరులోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని, కమలాపూర్ లోని వరి కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 154 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయాలని రైతులకు సూచించారు. ప్రతి మిల్లర్ కు ఒక ఏఈఓ ను అనుసంధానం చేశామని ,వడ్ల నాణ్యత పట్లగాని , మిల్లర్లు కాంటాలో ఎక్కువగా కోతలు విధించినా రైతులు సంబంధిత ఏఈఓ లేదా ఎమ్మార్వోలకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం చేస్తారని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. 15% తేమతో ఉన్న నాణ్యమైన వరి ధాన్యంను, తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సురేష్, ఆర్ఐ సురేష్, రైతులు పాల్గొన్నారు.
………………………………………………..