
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు, పంట పొలాలు కోల్పోయి నిర్వాసితులైన అర్హులైన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పి టిసి రామ సహాయం శ్రీనివాసరెడ్డి, లింగాల మాజీ ఎంపిటిసి ఊకే మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సందర్భంగా మండలంలో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ ఇటీవల వారం రోజులు పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని పలు గ్రామాలలో ఇండ్లు వర్షాలు దాటికి నేలమట్టం అయ్యాయని తెలిపారు. జిల్లాలోని మంగపేట, ఏటూరు నాగారం, వాజేడు ,తాడువాయి, వెంకటాపురం, గోవిందరావుపేట, కన్నాయ గూడెం, వెంకటాపూర్ తదితర మండలాల్లో విస్తారంగా వర్షాలుకు ఇండ్లు కోల్పోయిన, పంట పొలాలలో ఇసుక మేటలు వారికి నష్ట పరిహారం, ఆర్థిక సహాయం తో పాటు ఇందిరమ్మ గృహాలు అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడువాయి మండలం లోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి సర్వం కోల్పోయినా వారిని పరామర్శించి సానుభూతి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పాయం నరసింగరావు, నాలి రమేష్, వెంకటేశ్వర్లు,సీతారాములు,బుచ్చయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….