* 70 కోట్లు విలువ చేసే ప్రభుత్వ అసైన్డ్ భూమి కబ్జా పై అధికారులు నిర్లక్ష్యం.
* కలెక్టరేట్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన,వినతి, రెవిన్యూ యంత్రాంగం కండ్లు తెరిపించాలనీ.
* జ్యోతిస్మతి ఇంజనీరింగ్ కాలేజి యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
* ప్రజావాణిలో ఇచ్చిన పిర్యాదులు పరిష్కారానికా.. చెత్త బుట్టలోకా..?
ఆకేరు న్యూస్, కరీంనగర్ :
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిస్మతి ఇంజనీరింగ్ విద్యాసంస్థ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఏఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పిర్యాదుకు ముందు గాంధీ విగ్రహం వద్ద నిరసన, రెవిన్యూ అధికారులు కండ్లు తెరిపాంచాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన చేపట్టారు. అనంతరం ఏఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ జ్యోతిస్మతి ఇంజనీరింగ్ విద్యాసంస్థ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అనేకసార్లు జిల్లా కలెక్టర్ గారికి , ఆర్డీవో గారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలే వేస్తున్నారా అని ప్రశ్నించారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రెవెన్యూ గ్రామ పరిధి లోని 574, 576 సర్వే నంబర్లలోని అసైన్డ్ భూమిని జ్యోతిస్మతి ఇంజనీరింగ్ విద్యాసంస్థ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూమినీ 2007 లోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు అప్పటి తహసిల్దార్ సర్క్యులర్ నెంబర్ బి/293/1/2007 ఇచ్చిందని అన్నారు. దీనిపై జ్యోతిష్మతి యజమాన్యం ఆర్డీవో కోర్టు, అడిషనల్ కలెక్టర్ కోర్టు, హైకోర్టులో కూడా కేసు వేశారు అన్ని కోర్టులు కేసులు కొట్టి వేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ రోజు ఏఎఫ్ బి ఆధ్వర్యంలో 173 పేజీలున్న అన్ని ఆధారాలను అధికారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జ్యోతిష్మతి యాజమాన్యం సాగర్ రావు కబ్జా చేసిన ప్రభుత్వ సైన్డ్ భూమి 19 ఎకరాలు పైగా ఉన్నది దీని విలువ దాదాపు 70కోట్లు పైగా విలువ చేస్తుందని ప్రభుత్వ యంత్రాంగం స్వాధీనం చేసుకోవడంలో రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అప్పటి రెవెన్యూ మంత్రి స్టే ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులకు సవాల్ విస్తృతున్నాం స్టే ఉన్నట్లు చూపించాలని డిమాండ్ చేశారు. జ్యోతిష్మతి యజమాన్యం జీవో 59 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జ్యోతిష్మతి యాజమాన్యానికి పెద్ద ఎత్తున వ్యాపారాలు, వేల కోట్లు , 100 ఎకరాలకు పైగా భూములు ఉన్న సాగర్ రావుకు ఏ రకంగా రెగ్యులరైజ్ చేస్తారని అధికారులను ప్రశ్నించారు. మహాత్మా గాంధీ గారైన ప్రభుత్వ అధికారులకు పండ్లు తెరిపించాలని గాంధీ గారి విగ్రహం వద్ద నిరసన చేసి గాంధీ గారికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని స్వాధీనం చేసుకోకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో వందల మంది దళితులను, ప్రజలను సమీకరించి సింహం జెండాలతో వెళ్లి జెండాలు పాతుతామని ప్రజలకు పంచుతామణి హెచ్చరించారు. అనంతరం ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్టే అనేది 6 నెల కంటే ఎక్కువ ఉండదని అన్నారు. స్టే ఉన్నదాని గత 15 సంవత్సరాల కాలయాపన చేయడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా జ్యోతిస్మతి యాజమాన్యం కబ్జా చేసిన తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రెవెన్యూ గ్రామ పరిధి లోని 574, 576 సర్వే నంబర్లలోని అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, తిరిగి నిరుపేదలైన దళితులకు ఇవ్వాలని లేదా ప్రజా అవసరాల కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తునమాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి బొంకూరి సురేందర్ (సన్నీ) కమిటీ సభ్యులు జీ.ప్రశాంత్, కె. బద్రినేత, యూత్ లీగ్ రాష్ట్ర కన్వీనర్ రావుల ఆదిత్య, పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, అరుణ్ రాజు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
……………………………………………………..
