
* అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: గాంధీ భవన్లో గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉందని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలోగవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ మీడియా పాయింట్లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఈ ప్రభుత్వం, ఆరు గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమోనని అనుకున్నామన్నారు. ‘గత 15నెలల పేలవమైన, అట్టర్‌ఫ్లాప్ పరిపాలన గురించి ప్రాయశ్చిత్తం చేసుకునేవిధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించామని.. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదని.. కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉందన్నారు.
గవర్నర్ స్థాయిని ప్రభుత్వం దిగజార్చింది..
‘రాష్ట్రంలో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నయ్. ఇప్పటికే 480 పైచీలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఒక మాట రైతులకు స్వాంతన చేకూర్చే, ఉపశమనం, భరోసా ఇచ్చేమాట గవర్నర్ నోటినుంచి వస్తుందేమోననని ఆశించామని..గవర్నర్ స్థాయిని సైతం దిగజార్చి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని, నీచత్వాన్ని బయటపెట్టుకుంది’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
…………………………………………………….