
* పోలీసులకు సినిమా యూనిట్ ఫిర్యాదు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ‘కన్నప్ప’ సినిమాకు చెందిన హార్డ్ డిస్క్ మాయమైంది. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులపై కేస్ పెట్టింది ‘కన్నప్ప’ టీమ్. కన్నప్ప హార్డ్ డిస్క్ పట్టుకొని ఇద్దరు పారిపోయారని, వాళ్లని పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ తెలిపారు. కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని ముంబైలోని ఓ స్టూడియోలో విజువల్ ఎఫెక్ట్స్ చేయించామని, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ ను కొరియర్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కొరియర్ అందుకొన్న ఆఫీస్ బాయ్ రఘు, మరో మహిళతో కలిసి పరార్ అయ్యాడు. ఆ హార్డ్ డిస్క్ కోసం తమకు ముఖ్యమంటూ కన్నప్ప యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు రూపొందిస్తున్నారు. ఈసినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. చిత్రంలో అన్ని ఇండస్ట్రీలకి సంబంధించిన స్టార్స్ ఉండడంతో మూవీపై అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. చిత్రంలో విష్ణు మంచుతో పాటు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా , విష్ణు కూతుళ్లు ఇలా చాలా మంది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమాని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
……………………………………………….