
* మొదలైన పాఠశాలలు
* కుంటినడకన ప్రభుత్వవిద్య
* ప్రోత్సాహం కరువైన విద్యారంగం
* పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత
* సబ్జెక్టు టీచర్లు లేని పాఠశాలలెన్నో
* ఇంకా చదువుకు నోచుకోని గ్రామాలు
* మౌలిక సదుపాయాలు కరువు
* వ్యాపారంగా మారిన విద్య
* విస్తరిస్తున్న కార్పొరేట్ రంగం
* చదువు*కొన*లేకపోతున్న పేద,మధ్య తరగతి వర్గం
ఆకేరు న్యూస్ డెస్క్ : జూన్ నెల వచ్చింది మళ్లీ ఎధావిధిగా పాఠశాలలు ప్రారంభ కానున్నాయి.. ఇక ఎటు చూసినా హడావుడి వాతావరణమే కన్పిస్తుంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో విద్యారంగం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల తీరు ఎలా ఉందో గమనిద్దాం..
విద్యలేని వాడు విద్య పశువు అన్న సామెత ఉంది . విద్యకు జీవోనాపాధికి సంబందం ఉండకపోవచ్చు. అక్షరాభ్యాసం లేని వాళ్లు కూడా హాయిగా జీవిస్తున్నారేమో.. కాని ఈ రోజుల్లో చదువుకు ఉన్న ప్రాధాన్యత మరి దేనికీ లేదు.. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చదువుకొని తీరాల్సిందే… సమాజంలో ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి చూస్తూండగనే కాలచక్రం గిర్రున తిరిగింది.. ల్యాండ్ పోన్ల స్థానంలో సెల్ ఫోన్లు వచ్చాయి.. ఒకప్పుడు వస్తు మార్పిడి పద్దతి తరువాత కరెన్సీని కనిపెట్టారు.. ఆ తరువాత డిజిటల్ కరెన్సీ వచ్చంది.. డిజిటల్ కరెన్సీ లావాదేవీలు నడుస్తున్న ఈ క్రమంలో చదువు ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసి వచ్చింది… కూరగాయలు అమ్ముకునే వారు మొదలుకొని చివరికి బిక్షం అడుక్కునే వారు కూడా డిజిటల్ పద్దతికి అలవాటు పడుతున్నారు.. ఈ నేపధ్యంలో చదువు కంపల్సరీ అనే విషయం అందరికీ బోధపడింది..కాయకష్టం చేసి అయినా పిల్లలను చదివిస్తున్నారు..కానీ స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా దేశంలో చదువు అందవారికిఅందుబాటులోలేకుండాపోయింది.కార్పొరేట్స్కూళ్లలోచదివించలేక ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులేక పేద మధ్యతరగతి తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు.విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో పొందుపరిచి నా విద్యకు నోచుకోని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.పాఠశాలలు లేని ఎన్నో గ్రామాలు దేశంలో ఉన్నాయి. ప్రాథమిక విద్య లేని గ్రామాలు ఉన్నాయి.. ప్రాథమిక విద్యపూర్తయితే మాధ్యమిక విద్ద లేక అక్కడికే అపేస్తున్నారు మాధ్యమిక విద్య పూర్తి చేసుకుంటే ఉన్నత విద్య అందుబాటులోలేక సుదూర ప్రాంతాలకు వెళ్లె లేక చదువును మధ్యంతరంగాఆపేస్తున్నారు. ప్రాథమిక విద్య పూర్తయితే మాధ్యమిక విద్య అందుబాటులో ఉండదు మాధ్యమిక విద్య పూర్తి చేసుకుంటే ఉన్నత విద్య అందుబాటులో ఉండదు.
పాఠశాలల కొరత..
తెలంగాణలో 3,688 శివారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలే లేవు.546 గ్రామాల్లో కనీసం అక్షరాలు దిద్దించడానికి సింగిల్ టీచర్ ఉన్న పాఠశాల లు దిక్కు లేవు 2,018 గ్రామాలు మాధ్య మిక విద్యకు దూరంగా ఉన్నాయి. దాదాపు రెండు వేల గ్రామాలకు ఉన్నత పాఠశాలలు లేవు వేల సంఖ్యలో విద్యార్థులుచదువుకోసం సుదూర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.ప్రతీ రోజూ సుదూర ప్రాంతాలకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక చదువును మధ్యలోనే మానేస్తున్నారు.
ఉపాధ్యాయుల కొరత..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. 317 జీవో అమలు తరువాత రాష్ట్రంలోని పాఠశాలలో్ల 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో టీచర్ ట్రేనింగ్ బీఎడ్ పూర్తి చేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు వారంతా ప్రభుత్వం డీ ఎస్సీ
ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అకడమిక్ సంవత్సరం మొదలు కాకముందే ప్రభుత్వం టీచర్ల నియామకం చేపడితే బాగుండేది.
సబ్జెక్టు టీచర్ల కొరత
సబ్జెక్టు టీచర్లను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో ఆసక్తి చూపడం లేదు.. విషయపరిజ్ఞానం లేని టీచర్లతో సబ్జెక్టులు బోధించడం వల్ల విద్యార్థుల పరిస్థితి వింతగా మారింది. వారికి సబ్జెక్టు అర్థంకాక పోవడంతో సంబందిత సబ్జెక్టుపై ఆసక్తి తగ్గుతోంది.లెక్కలు, సైన్స్,లాంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు..
మౌళిక సదుపాయాలు కరువు
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు ఉండవు సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు చెట్లకింద కూర్చోవాల్సి వస్తోంది.పిల్లకు ఆడుకోవడానికి ఆట స్థలం ఉండదు తాగడానికి నీళ్లుండవు కనీసం టాయిలెట్లు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి
వ్యాపారంగా మారిన విద్య..
నేడు సమాజంలో అత్యంత లాభాలు గడించే వ్యాపారాల్లో విద్య ఒకటి విద్య వైద్యం మద్యం ఈ మూడు నేడు సమాజంలో లాభాలతో గడించే వ్యాపారాలుగా మారాయి.విద్యపై వస్తున్నలాభాలను గమనించిన పెట్టుబడి వర్గం విద్యారంగంలో అడుగుపెట్టి విద్యను పేదవాడికి అందుబాటులో లేకుండా చేసింది.
విస్తరిస్తున్న కార్పొరేట్ ప్రపంచం
విద్యారంగంలో కార్పొరేట్ దిగ్గజాలు అడుగుపెట్టాయి అలాగే పెట్టుబడి వర్గం విద్యలో అడుగుపెట్టింది.
ఈ నేపధ్యంలో విద్య ఒక వ్యాపారంగా మారడమే కాదు అత్యంత ఖరీదనైదిగా మారింది. పేద మధ్యతరగతి వారు ప్రభుత్వ విద్యాసంస్థలు లేక కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకోలేక విద్యాకు దూరం అవుతున్నారు. ఎప్పుడైతే సమాజం విద్యకు దూరం అవుతుందో అప్పడు మళ్లీ సమాజం వెనుకటి రోజులకు తిరుగుముఖం పట్టినట్లుగా భావించాలి ఎందుకంటే కేవలం డబ్బులున్న వారే విద్యను చదువుకోగలిగితే డబ్బులు లేని వారి పరిస్థితి ఏంటో ఆలోచించాలి.. ఇప్పటికైనా ప్రభత్వ విద్యను పటిష్టం చేసి విద్యాసంస్థలకు విస్తృతంగా నెలకొల్పి పేదవాడికి విద్యను అందుబాటులోకి తేవాల్సిన అవసం ఉంది. మారుమూల కుగ్రామాల్లో కూడా పాఠశాలలను నెలకొల్పి సమాజంలో నిరక్షరాస్టులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుతత్వాలపై ఉంది.
……………………………………………