* భారత్ అరుదైన మైలురాయిని దాటిందన్న రాజ్నాథ్
ఆకేరు న్యూస్ డెస్క్ : భారత్ అరుదైన ఘనత సాధించింది. ఓ పెద్ద మైలురాయిని దాటింది. హైపర్ సోనిక్ క్షిపణి (HIPOR SONIC MISSILE) పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీవో ఈ క్షిపణిని ఆదివారం ఉదయం విజయవంతంగా పరీక్షించింది. ఇది 1500 కిలోమీటర్లకు మించిన వివిధ పే లోడ్లను సునాయాసంగా లక్ష్యానికి తీసుకెళ్లగలదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(RAJNATHSING) ప్రకటించారు. భారత్ ఓ పెద్ద మైలు రాయిని దాటిందన్నారు. అత్యాధునిక మిలటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశౠల జాబితాలో భారత్ కూడా చేరినట్లయ్యిందని వెల్లడించారు. ఈ మేరకు హైపర్ సోనిక్ క్షిపణి పరీక్షకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశారు.
……………………………………………..