
* మయన్మార్ రెండో అతిపెద్ద నగరంలో భారీగా..
ఆకేరు న్యూస్, డెస్క్ : మయన్మార్ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం రాత్రి వరకు 1644 మంది చనిపోయినట్లు సైనిక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 3,408 మంది గాయపడ్డారని మయన్మార్ (Myanmar) సైనిక ప్రభుత్వం వెల్లడించింది. 139 మంది ఆచూకీ లభించలేదని పేర్కొంది. గల్లంతైన వారి కోసం విపత్తు నిర్వహణ బృందాలు గాలిస్తున్నాయి. రెండు భూకంపాల ధాటికి వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. మయన్మార్లో రెండో అతిపెద్ద నగరం మాండలేలో మృతుల సంఖ్య భారీగా ఉంది. మాండలే, నేపిడాలో సైనక ప్రభుత్వంతో పాటు, విదేశీ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఐక్యరాజ్య సమితితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కాగా, థాయ్లాండ్(Thailond)లో భూకంపం దాటికి 10 మంది మృతి చెందగా, 78 మంది ఆచూకీ గల్లంతయింది.
…………………………………………