
*స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు కో చైర్మన్గా నియామకం
ఆకేరున్యూస్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి కోడలు (MEGA STAR CHIRANJEEVI) ,రాంచరణ్ (RAMCHARAN) సతీమణి ఉపాసన(UPASANA)కు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ గా నియమించింది. చైర్మన్ గా సంజీవ్ గోయం(SANJEEV GOINKA)కా నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ 2025 (TELANGANA SPORTS POLACY 2025)ని తీసుకొచ్చింది. క్రీడారంగంలో తెలంగాణను ప్రథమ స్థానంలో ఉంచడమే లక్ష్యమని సీఎం రేవంత్ ఇప్పటికే చాలా సార్లు అన్నారు. ఇదిలా ఉండగా తనను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు(TELANGANA SPORTS HUB) కో చైర్మన్ గా నియమించినందుకు ఉపాసన రాష్ట్రప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
…………………………………