* అందెశ్రీ మృతిపై పీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ కవి రచయిత అందెశ్రీ మృతి సాహితీ ప్రపంచానికి తీరని లోటని
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అందెశ్రీ మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతోందని పవన్ పేర్కొన్నారు. జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించారని పవన్ కీర్తించారు.అందెశ్రీ కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
…………………………………………….
