* బర్రె దూడపై కన్నేశాడు
* బర్రెదూడపై అత్యాచారం చేసిన ప్రబుద్దుడు
ఆకేరు న్యూస్ మెదక్ : కామాతురాణాం నభయం న లజ్జా ..కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి సిగ్గు లజ్జ ఉండదంటారు.. చిన్న చిన్న పిల్లలపై అత్యాచారం చేసిన కామపిశాచులు ఉన్నారు.. కానీ ఓ ప్రబుద్దుడు కామ దాహం తీర్చుకోవడానికి మూగజీవిని వాడుకున్నాడు.. చెప్పుకోవడానికే సిగ్గుగా ఉన్న ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి జరిగింది. మీర్జాపల్లికి చెందిన సిద్దిరాములు మధావిధిగా సోమవారం రాత్రి తన పశువులను పొలంలో ఉన్న షెడ్డులో కట్టేసి ఇంటికి వెళ్లగా అతని వద్ద పనిచేస్తున్న బిహార్ కు చెందిన రోహిత్ అనే ప్రబుద్దుడు రాత్రి పది గంటల సమయంలో షెడ్డులోకి వెళ్లి బర్రెదూడపై అత్యాచారం చేశాడు.ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో చూసిన షెడ్డు యజమాని.. రోహిత్ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………
