* కల్యాణమస్తు స్కీం కింద తులం బంగారం ఎక్కడ..?
* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల వివాహానికి కల్యాణమస్తు స్కీం కింద తులం బంగారం ఇస్తామన్న హామీని రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానమని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అది అబద్ధమని శాసనమండలి సాక్షిగా బయటపడిరది. కల్యాణమస్తు పథకం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కల్యాణమస్తు పథకం గురించి మేం అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతూన్నారని కవిత ధ్వజమెత్తారు. మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత మండిపడ్డారు.
……………………………