
*నెలనెలా వేతనాలు చెల్లించాలి
*తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్
ఆకేరున్యూస్ హనుమకొండ ః సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లాఅధ్యక్షులు పల్లె రామన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య సిఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల.రమేష్ లు హాజరై మాట్లాడారు. .. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 40 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో కూడా గ్రామాల్లో సేవలందించినా వారి సేవలకు గుర్తింపు లభించలేదన్నారు. గత ప్రభుత్వం 51 జీవో ద్వారా అమలు చేసిన మల్టీ పర్పస్ వర్కర్ పద్దతిని వెంటనే రద్దు చేయాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినా పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిసాతమని హామీ ఇచ్చి ఇంతవరకూ చెల్లించకపోవడం విచారకరమన్నారు.కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పించాలని కోరుతూ మంత్రిగారికి అనేకసార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ చూపి పరిష్కారం చేయాలని ఈ నెల 27 న చలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యాకయ్య , నాయకులు భాస్కర్ , రాజు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
………………………………………..