* పదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్
* హాజరై ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ నేత నితీష్ కుమార్ బిహార్ కు ముఖ్యమంత్రిగా పదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. పాట్నాలో ని గాంధీ మైదాన్ లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నితీష్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి (Samrat Choudhary), విజయ్ కుమార్ సిన్హ (Vijay Kumar Sinha) ప్రమాణం చేశారు. బీజేపీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 202 స్థానాల్లో జయకేతనం ఎరుగవేసింది. ఇందులో బీజేపీకి 89, నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ)కు 85, కూటమి పార్టీలైన ఎల్జేపీ (రామ్ విలాస్)కి 19, హెచ్ఏఎం 5 , ఆర్ఎల్ఎస్పీ 4 సీట్లలో విజయం సాధించాయి.

……………………………………..
