
* బైక్ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగస్తులు
ఆకేరు న్యూస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు
వరంగల్, హనుమకొండ జిల్లాల ఉద్యోగులు హనుమకొండలో ఆందోళన చేపట్టారు. పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నేడు అంబేద్కర్ విగ్రహం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఉద్యోగులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
……………………………………….