
* మేసేజ్ చేసి కోట్లు కొట్టెసిన సైబర్ నేరస్థుడి అరెస్టు
ఆకేరున్యూస్, వరంగల్: యజమాని పేరుతో మేసేజ్ చేసి కోట్లు కొట్టెసిన సైబర్ నేరస్థుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు గత రాత్రి అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబందించి వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ డి.ఎస్సీ సి.హెచ్. ఆర్.వి. ఫణీందర్ వివరాలను వెల్లడిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రతాప్ ఘడ్ జిల్లాకు చెందిన నిందితుడు ప్రదీప్ కుమార్ (39) హన్మకొండ పట్టణంలోని ప్రముఖ హచరీస్ సంస్థలో పనిచేస్తున్న గుమాస్తాకు గత నెల 19వ తేదిన ఒక గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుండి నేను మీ యజమానిని ఇది నా కొత్త ఫోన్ నంబర్ అని ఈ నంబర్ సేవ్ చేసుకోమ్మని సదరు సంస్థ గుమాస్తా వాట్సప్ మేసేజ్ పంపియడంతో తన యజమాని నంబర్ భ్రమ పడిన సంస్థ గుమాస్తా మేసేజ్లోని నంబర్‌ను తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. మరుసటి రోజున గుమాస్తా తాను సేవ్ చేసుకున్న నంబర్‌కు ఫోన్ చేయగా నేను మీటింగ్‌లో వున్నాను తరువాత చేస్తాను అని సైబర్ నేరగాడు సమాధానం ఇస్తాడు. అనంతరం మరుసటి రోజున గుమాస్తా సేవ్ చేసుకున్న నంబర్ నుండి నిందితుడు చేయడంతో తన యజమాని ఫోన్ చేస్తున్నాడు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయడంతో, ఎక్కడ వున్నావు అని అడిగి తన బ్యాంక్ లావాదేవీలను తదితర వివరాలను అడిగి తెలుసుకోని, ప్రస్తుతం వున్న బ్యాంక్ బ్యాలెన్స్ నుండి తను చెప్పిన ఆకౌంట్‌కు డబ్బును ట్రాన్స్ఫర్ చేయమనడంతో ఫోన్లో మాట్లాడేది తన యజమానిగా భావించిన సదరు సంస్థ గుమాస్త నిందితుడు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు రెండు దఫాలుగా మొత్తం ఒక కోటి 68లక్షల రూపాయలను బదిలీ చేశాడు. మరోమారు నిందితుడు ఫోన్ చేయడంతో నిందితుడి మాటతీరును తప్పుపట్టి గుమాస్త అనుమానంతో తన సంస్థ యజమానికి సంబంధించిన వ్యక్తిగత నంబరు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడటంతో కంగుతిన్న సంస్థ యజమాని, గుమాస్తా తాము సైబర్ నేరగాడి చేతి మోసపోయినట్లుగా గుర్తించి వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగంలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రస్తుతం పోలీసుల వద్ద వున్న టెక్నాలజీ వినియోగించుకోని సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాడిని అరెస్టు రిమాండ్‌కు తరలించారు. నిందితుడి పట్టుకోవడంలో శ్రమించిన సైబర్ క్రైమ్స్ ఇన్స్‌స్పెక్టర్ యాసిన్, ఎస్.ఐలు చరణ్, శివ, కానిస్టేబుళ్ళు శివ, జహూర్ ను డి.ఎస్పీ అభినందించారు.
………………………………………………………….