
* ఏపీ మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, తెనాలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి (JAGAN MOHANREDDY) అనడానికి తెనాటి ఘటనే నిదర్శనమన్నారు. ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. తెనాలి(TELALI)లో పోలీసులు కొట్టిన యువకుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక గొంతులను అణగదొక్కుతున్నారని అన్నారు. పోలీస్ వ్యవస్థ వికృత రూపం దాల్చిందన్నారు. తెనాలిలో అన్యాయమైన ఘటన జరిగిందని, పోలీసులు కొట్టిన ముగ్గురు అణగారిన వర్గాలకు చెందిన వారు ఐతానగర్ లో కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతుంటే ఆపే ప్రయత్నం చేశారని, అదే వాళ్లు చేసిన తప్పా అని ప్రశ్నించారు. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనార్టీలు, ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారని, రాకేష్ హైదరాబాద్ (HYDERABAD)లో జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడని అన్నారు. ఆ యువకుడు తెనాలిలోనే ఉండడం లేదని, పాత కేసులో వాయిదా ఉంటే వచ్చాడని, వారి స్నేహితులు కూడా మంగళగిరి నుంచి వచ్చారని తెలిపారు. జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ అని, బార్ కౌన్సిల్ లో సభ్యత్వం కూడా ఉందని అన్నారు. ఐతా నగర్ లో సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితోనే గొడవ పడుతుంటే ఆపినందుకు వారిని చితకబాదారని ఆరోపించారు. కొట్టద్దని వేడుకుంటున్నా కనికరం చూపలేదున్నారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారని ఆరోపించారు.
………………………………………………………