* మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డు ధర రూ.51లక్షల 7వేల 7 వందల 77లు
* సొంతం చేసుకున్న ఖమ్మం జిల్లా ఇల్లందు వాసి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సిటీలో మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏడాది అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేకవుతోంది. తాజాగా మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ ఈ ఏడాది కూడా అధిక ధర పలికింది. మాదాపూర్ మై హోమ్ భూజాలో లడ్డు వేలం పాట రికార్డు బ్రేక్ చేసింది. హోరా హోరీగా లడ్డూ వేలం పాట సాగింది. రూ.51లక్షల 7వేల 7 వందల 77లు పలికింది లడ్డూ. వేలం పాటలో ఈ లడ్డూను కైవసం చేసుకున్నారు . గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత. ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామ వాసి గణేష్ వేలం పాటలో లడ్డను కైవసం చేసుకున్నారు. . గత సంవత్సరం రూ.29 లక్షలకు మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ ధర పలికింది.
బేబీ పాండ్స్ ఏర్పాటు..
ఈ సారి గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేసింది.ఐదు ఫీట్లలోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లో నిమజ్జనం చేయాలని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్ బండ్‌పై చివరిరోజు మాత్రమే నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు. హెచ్ఎండిఏ, పోలీసులు, ఇతర శాఖలతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.మరోవైపు.. మహా నిమజ్జనానికి జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు సిద్ధం చేసింది. నగర వ్యాప్తంగా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసింది. 3 షిఫ్టుల్లో 4వేల మందితో క్లీనింగ్ కోసం జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తున్నారు. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే గణేష్ విగ్రహాల నిమజ్జనాలను పోలీసులు అనుమతిస్తున్నారు.
…………………………………………
