
* శాంతియుత ధర్నా కు మద్దతు తెలిపిన
బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి
ఆకేరు న్యూస్, ములుగు: CPS ను రద్దుచేసి OPS ను పునర్దించాలని ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాకు బడే నాగజ్యోతి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవో నెంబర్ 25 ను సవరించాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరూ ఉపాధ్యాయులు ఉండాలని, సబ్జెక్టు వర్క్ లోడు అనుగుణంగా టీచర్ పోస్టులకు కేటాయించాలని ఆమె కోరారు, ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. జీవో 317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానాలకు బదిలీ చేయాలని, అర్హత లేని ఆరోపణలున్న డిఈఓ లను తొలగించాలని, దీర్ఘకాలంగా ఒకే జిల్లాలో ఉన్న వారిని బదిలీ చేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులను పట్టించుకునే పాపాన పోలేదని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, పోరిక గోవింద్ నాయక్, ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, వేములపల్లి బిక్షపతి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, గండి కుమార్, రామసహయం శ్రీనివాస్ రెడ్డి, పోరిక విజయ్ రామ్ నాయక్, చెన్న విజయ్, తదితరులు పాల్గొన్నారు.
………………………………