
* కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
* జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల శాంతి దీక్ష
ఆకేరు న్యూస్ ములుగుః తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలంటూ ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్యమకారులు గాంధీ పార్క్ వద్ద శాంతి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ కోరిక గోవింద నాయక్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఉద్యమకారులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఉద్యమకారులకు హెల్త్ కార్డులు ఇస్తామని, 25 వేల పెన్షన్ అందిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పలు హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచారని వివరించారు. పలు సమస్యల ను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ పార్టీ హామాలను అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు.లేనియెడల దశలవారీగా ఉద్యమం తీవ్రతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జంపాల రవీందర్ , చంటి భద్రయ్య, బిక్షపతి సర్దార్ పాషా దర్శనాల సంజీవ గులగట్టు సంజీవ బత్తుల రాణి పత్తి గోపాల్ రెడ్డి రాజేశ్వరరావు నర్ర భద్రయ్య నరేష్ మల్లయ్య జాజ నరసింహులు బైక్ అని ఓదెలు సమ్మక్క లక్ష్మి ఉపేంద్ర కళావతి సుగుణ తో పాటు ఉద్యమకారులు పాల్గొన్నారు.
……………………………………….