
* మిర్యాలగూడలో యువకుడిపై దాడి
ఆకేరు న్యూస్ ,నల్గొండ : తెలంగాణలో డ్రగ్స్ (drugs)గంజాయి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపధ్యంలో గంజాయి వ్యసనానకి గురై విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఆదివారం నల్గొండ (nalgonda)జిల్లా మిర్యాల గూడ(miryalaguda)లో దారుణం చోటు చేసుకుంది. గంజాయి సేవించిన ఓ గ్యాంగ్ అకారణంగా ఓ యువకుడిపై దాడి చేశారు. దాదాపు పది మంది గంజాయి(ganja) సేవించిన యువకులు స్థానిక బంగారు గడ్డ లోని పప్పు మిల్ వద్ద ఓ యువకుడితో అకారణంగా గొడవపడి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి పోలీసులకు చేరుకునే సరికే గంజాయి సేవించిన యువకులు పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
………………………………